శిరోముండనం కేసులో సినీ నిర్మాత నూతన్‌నాయుడు అరెస్ట్

శిరోముండనం కేసులో  ఇప్పటికే నూతన్ నాయుడు‌ భార్య ప్రియమాధురిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. . కర్ణాటకలోని ఉడిపి వద్ద  శుక్రవారం మధ్యాహ్నం సినీ నిర్మాత నూతన్‌ నాయుడు‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని సీపీ మనీష్ కుమార్ సిన్హా మీడియాకు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపామని తెలిపారు. ఘటన జరిగిన రోజు 6 సెల్‌ఫోన్స్‌ సీజ్ చేశామని.. నూతన్ నాయుడు భార్య సమక్షంలోనే దళిత యువకుడికి శిరోముండనం జరిగిందని సీపీ మనీష్ కుమార్ సిన్హా వెల్లడించారు. సీసీ ఫుటేజీతో పాటు కీలక ఆధారాలు సేకరించామని సీపీ మనీష్‌కుమార్ సిన్హా తెలిపారు.