తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుకు కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు శనివారం ట్విటర్ వేదికగా స్పందించిన ఆయన తనకు వైరస్ సోకినట్లు వెల్లడించారు.. ‘‘ కరోనా లక్షణాలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. టెస్టులో పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నన్ను కలిసిన వారందరూ ఐసోలేషన్‌లో ఉంటూ కరోనా పరీక్షలు చేయించువాల’ని కోరారు. కాగా, పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఆయన త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు దూరం కానున్నారు. హరీష్‌రావు త్వరగా కోలుకోవాలని టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు.