శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశమైంది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, శాసనసభా వ్యవహాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణ, ఎజెండాపై చర్చించి ఖరారు చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాలను 20 రోజుల పాటు నిర్వహించాలని సూత్రప్రాయంగా ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే.
