తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాయకంటి ప్రతాప్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆ సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ తెలిపారు. సోమవారం టీఎన్జీవోభవన్లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయనను ఎన్నుకున్నట్టు పేర్కొన్నారు.
