మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సభ్యులందరూ ఈ తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. మళ్లీ బుధవారం ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. రేపట్నుంచి గంట పాటు ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో కేవలం 6 ప్రశ్నలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం జీరో అవర్ అర గంట పాటు కొనసాగనుంది. అనంతరం సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. 10, 11 తేదీల్లో కొత్త రెవెన్యూ చట్టంపై సభలో చర్చ జరగనుంది.
