జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గచ్చిబౌలి లోని సన్ షైన్ హాస్పిటల్ ప్రాంగణంలో మొక్కలు నాటిన హాస్పిటల్ చైర్మన్ డా.గురువా రెడ్డి. ఈ సందర్భంగా డా.గురువారెడ్డి మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చొరవ తీసుకొని చేస్తున్న ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.ఇది మంచి కార్యక్రమం అని అన్నారు.కాలుష్యాన్ని అరికట్టడానికి చెట్లు దోహదపడతాయి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గొప్పగా నడుస్తున్నందుకు ఆనందంగా ఉంది ఇది విజయవంతమై మరింత మంది మొక్కలు నాటి ఇండియాను గ్రీన్ ఇండియా గా తయారు చేయాలని నా ఆకాంక్ష అని అన్నారు.ఈ కార్యక్రమానికి నా వంతు సాయం చేస్తాను.ఈ సందర్భంగా గ్రీన్ చాలెంజ్ స్వీకరించాల్సిందిగా కిమ్స్ హాస్పిటల్ ఎండి డా.భాస్కర్ రావు, స్టార్ హాస్పిటల్ ఎండి డా.గోపిచంద్, రెయిన్ బో హాస్పిటల్ ఎండీ డాక్టర్ రమేష్ ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు.