సీఎం కేసీఆర్‌ బాల్యమిత్రుడు కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానం చైర్మన్‌ వెంకటేశం కన్నుమూత

 సీఎం కేసీఆర్‌ బాల్యమిత్రుడు, కాళేశ్వర ముక్తీశ్వర ఆలయ కమిటీ చైర్మన్‌ బొమ్మర వెంకటేశం(66) బుధవారం కన్నుమూశారు. కరోనా పాజిటివ్‌ రావడంతో కొద్దిరోజులుగా ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం తుదిశ్వాస విడిచారు. వెంకటేశానికి భార్య విజయ, నలుగురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. బాల్యమిత్రుడు వెంకటేశం మృతిపై సీఎం కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. కరోనా బారినపడి వెంకటేశం మరణించడం బాధాకరమని విచారం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంకటేశం మృతిపట్ల దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సంతాపం ప్రకటించారు.