గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యాంకర్ శిల్పా చక్రవర్తి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ చిత్రలేఖ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు సోమాజిగూడలోని తన నివాసంలో మొక్కలు నాటిన యాంకర్ శిల్పా చక్రవర్తి.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం నియంత్రించడం కోసం ప్రతి ఒక్కరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని కోరారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆశు రెడ్డి, సమీర్, జ్యోతిలను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.