సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం సంభవించింది. పిలెట్ ఫార్మా పరిశ్రమలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. మరొకరి కోసం సిబ్బంది గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది మూడు అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎగసిపడుతున్న మంటలను అదపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు.
