- హైదరాబాద్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సమాచార హక్కు చట్టం వర్తించదా..
- లేదంటే పొల్యూషన్ చేస్తున్న పరిశ్రమల బాగోతం భయటపడతదని భయమా..
- కార్పొరేట్ ఆస్పత్రుల కొమ్ముకాస్తున్న హైదరాబాద్ పిసిబి అధికారులు
- హైదరాబాద్ పిసిబి అధికారులకు సమాచార హక్కు చట్టం అంటే గౌరవం లేదా ..
- సమాచార హక్కు చట్టంపై ఇంత నిర్లక్ష్యం ఎందుకు..?
- హైదరాబాద్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుపై స్వర్వత్రా విమర్శలు..
- ప్రజా ప్రభుత్వం వీరిని నియమించింది చట్టాలను అమలుపర్చి ప్రజలకు మేలు చేయడానికా..? లేకపోతే వాటిని అతిక్రమించి ప్రజలను నాశనం చేయడానికా..?
- హైదరాబాద్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల తీరుపై అసహనంతో రగిలిపోతున్న ప్రజలు, పర్యావరణ వేత్తలు
అది పర్యావరణాన్ని కాపాడాల్సిన బోర్డు.. పొల్యుషన్ ను కట్టడి చేసి ప్రజలకు రక్షణగా ఉండాల్సిన బోర్డు.. కానీ అక్కడ జరిగే తంతు వేరే ఉంటది పొల్యూషన్ ను కంట్రోల్ చేసుడు దేవుడెరుగు.. అక్కడ అవినీతికే పెద్దపీట వేస్తారని వినికిడి. అంతేకాదు పొల్యూషన్ చేసే పరిశ్రమలకు కావాల్సిన మద్దతు హైదరాబాద్ పిసిబి అధికారులు ఇస్తారని ప్రజల నోటినుండి వస్తున్న మాట. ఇక కార్పొరేట్ ఆస్పత్రులకు పిసిబి అధికారుల సపోర్ట్ గురించి అయితే చెప్పాల్సిన పనేలేదు. కార్పొరేట్ ఆస్పత్రులు పిసిబి నిబంధనలను తుంగలో తొక్కి ఎంతకు తెంగించిన సరే పట్టించుకునే వారే ఉండరు. అంతేకాదు లంచం ఇస్తే చాలు పిసిబి అధికారులే కార్పొరేట్ ఆస్పత్రులకు ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చి ప్రొత్సహిస్తారని విశ్వనీయవర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం. అవినీతికి పెద్దపీట వేయడంలో హైదరాబాద్ పిసిబి అధికారులది ఓ ప్రత్యేకమైన స్థానంగా చెప్పొచ్చు అంటున్నారు. జోగులంబ గద్వాల జిల్లాలో పొల్యుషన్ చేస్తున్న జిన్నింగ్ మిల్లులపై చర్యలు తీసుకోవడం పక్కకు పెట్టి, జిన్నింగ్ మిల్లుల యాజమానుల నుండి నెల నెల మామూళ్లు వసూలు చేసుకుంటూ అటువైపు చూడటం కూడా మర్చిపోయారు హైదరాబాద్ పిసిబి అధికారులు. లంచం ముడితే చాలు ఏ పరిశ్రమ ఎంత పొల్యూషన్ చేసిన హైదరాబాద్ పిసిబికి పట్టదు. అంతేకాదు వీరికి డబ్బు సంపాదన తప్ప ఇంకో విషయం చెప్పిన వీరి చెవికి ఎక్కదు. ఎవరైనా పొరపాటున పొల్యూషన్ చేస్తున్న పరిశ్రమలపై ఫిర్యాదు చేస్తే వాటి మీద చర్యలు తీసుకోవడం పక్కకు పెట్టి పరిశ్రమల వారికి సపోర్ట్ గా మీ మీద ఫిర్యాదు వచ్చింది అని చెప్పి, అవసరం అయితే పరిశ్రమ వారిని బెదిరించి వారి దగ్గర సరిపోను డబ్బులు వసూలు చేయడంలో హైదరాబాద్ పిసిబి అధికారులది ఓ ప్రత్యేక స్థానం అంటున్నారు పర్యావరణ వేత్తలు, ఫిర్యాదుదారులు. అంతటితో అగుతారా అంటే అది లేదు పొల్యూషన్ చేసే ప్రతి ఇండస్ట్రీ నుంచి ప్రతినెల లక్షల్లో అవినీతి సొమ్ము రావాల్సిందేనంట. పొల్యూషన్ ను కంట్రోల్ చేయడంలో ముందుండాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పొల్యూషన్ ను క్రియేషన్ చేయడంలో ముందుండి పొల్యూషన్ క్రియేషన్ బోర్డుగా తయారు చేస్తున్నారని వాపోతున్న పొల్యూషన్ బాధితులు, పర్యావరణ వేత్తలు.
హైదరాబాద్ పిసిబి అధికారులకు అవినీతి సొమ్ముపై ఉన్న ప్రేమ పనిచేయడంపై ఉండదని ఓ పర్యావరణ వేత్త మాట. అందుకు ఉదాహరణగా తాను చెప్పిన విషయం.. పర్యావరణ వేత్త తను 28.01.2020న పిసిబి ప్రధాన కార్యాలయంలో పిసిబి వారి నుండి తనకు కావాల్సిన సమాచారం కోసం సమాచార హక్కు చట్టం – 2005 కింద దరఖాస్తు చేస్తే పిసిబి ప్రధాన కార్యాలయం వారు ఆ సమాచారాన్ని ఇవ్వల్సిందిగా హైదరాబాద్ పిసిబి అధికారులకు లేఖ రాస్తే వారు మాత్రం వారికి అనుకూలంగా, వారికి నచ్చిన విధంగా సమాధానం ఇస్తూ ఆ పర్యావరణవేత్తకు లేఖ రాాసారు. హైదరాబాద్ పిసిబి అధికారులు పంపిన లేఖ చూసి ఏమీ అర్థంకానీ ఆ పర్యావరణ వేత్త అదేంటి సార్ నేను అడిగిన సమాధానం పంపకుండా వేరే ఎదో లేఖ పంపినారు అని అడిగితే వారి నుండి సరైన సమాధానం కూడా ఉండదు. సరే పిసిబి ప్రధాన కార్యాలయం వారు మెయిల్ లో పంపిన లేఖ హైదరాబాద్ పిసిబి కార్యాలయం వారికి అర్థం కాలేదేమోనని ఆ ఫిర్యాదుదారుడు భావించి వారికి మరో లేఖ స్వయంగా హైదరాబాద్ పిసిబి పౌరసమాచార అధికారికి 27.05.2020 రోజున సమాచార హక్కు చట్టం – 2005 కింద తనకు కావాల్సిన సమాచారం ఇవ్వల్సిందిగా కోరితే ఈ సారి కూడా హైదరాబాద్ పిసిబి అధికారులు మళ్లీ వారికి అనుకూలంగా, వారికి నచ్చిన విధంగా సమాధానం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆ లేఖ చూసి అశ్చర్యపోయిన ఫిర్యాదుదారుడు ఫోన్ చేసి అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా మీకు నచ్చిన విధంగా లేఖ రాయడం ఏంటి సర్ అని ఇ.ఇ. దయానంద్ ని అడిగితే వారి నుండి సరైన సమాధానం ఉండదు. పౌరసమాచార అధికారిని అడిగితే సరైన సమాధానం ఉండదు. నెలలు గడుస్తున్న ఎన్నిసార్లు ఫోన్ చేసి అడిగిన ఎదో ఒక సమాధానం చెప్పడం తప్ప ఇప్పటికి వారి నుండి ఆ ఫిర్యాదుదారునికి సరైన సమాధానం ఇవ్వలేదు. అంటే దీన్ని బట్టే అర్థంచేసుకోవచ్చు హైదరాబాద్ పిసిబి అధికారుల అవినీతి బాగోతం ఏ స్థాయిలో ఉందో.. లేదంటే హైదరాబాద్ పిసిబి అధికారులకు సమాచార హక్కు చట్టం – 2005 వర్తించదా.. లేకపోతే సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం ఇస్తే వారి యొక్క అవినీతి బాగోతం భయటపడుతుందని భయమా..? ఇది ఎవరికి అర్థంకానీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతుంది..
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో జరుగుతున్న అవినీతి, అరాచకం, అసాంఘిక కార్యకలపాల గురించి.. అక్కడి అధికారులు చట్టవ్యతిరేకమైన పనులు ఏం చేస్తున్నారో మరిన్ని విషయాలు.. వివరాలు, పూర్తి ఆధారాలతో త్వరలో సీరియల్ గా మీ ముందుకు తీసుకువస్తుంది. మీ ’’నిఘా నేత్రం న్యూస్‘‘.