కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌లో అటవీ భూములకు ప్రత్యేక కామ్ పెడుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కొత్త రెవెన్యూ చట్టంపై శాసనసభలో సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఆర్‌వోఎఫ్ఆర్ భూముల విషయంలో కూడా గత పాలకులు ఓ రాజకీయ దందా చేశారు. ఏ పార్టీ వారైనా అడవి బిడ్డలకు అన్యాయం చేయొద్దు. అడవుల యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనిది. ఇది కూడా ఓ రాజకీయ దందా. అడవి బిడ్డలకు కూడా రైతుబంధు ఇచ్చామన్నారు. ప్రజలను మోసం చేసే అలవాటు తమకు లేదన్నారు. అటవీ భూముల్లో పంట చేసుకునే వారు ఆ భూములకు ఓనర్లు కాదు. ఆర్‌వోఎఫ్ఆర్ భూములకు ధరణి పోర్టల్లో ప్రత్యేక కాలం పెడుతామన్నారు. ఆర్‌వోఎఫ్ఆర్ భూములను తప్పకుండా రక్షిస్తాం. ఇప్పటికే పట్టాలు ఇచ్చిన గిరిజన భూముల జోలికి వెళ్లమని సీఎం స్పష్టం చేశారు. ఇతర రైతులు పొందే లబ్ధి కూడా ఈ గిరిజన రైతులకు వర్తిస్తుందన్నారు. పోడు భూములపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటమన్నారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు రక్షణ కల్పిస్తాం. ఒక్క గుంట కూడా అటవీ భూమిని కబ్జా కానివ్వమని సీఎం చెప్పారు.
