ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా 9999 క‌రోనా పాజిటివ్ కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా ఉధృతి కొన‌సాగుతున్న‌ది. రాష్ట్రంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 9,999 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో క‌రోనా బాధితుల సంఖ్య 5,47,686కు చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల్లో 96,191 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మ‌రో 4,46,716 మంది బాధితులు మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు కొత్తగా 77 మంది బాధితులు మృతిచెందారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా వ‌ల్ల మ‌ర‌ణించిన‌వారి సంఖ్య 4779కు పెరిగింది. ఈమేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య ఆరోగ్య‌శాఖ హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది.