కొత్త రెవెన్యూ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ భూమి హ‌క్కులు, ప‌ట్టాదారు పాస్‌బుక్‌ల బిల్లు-2020కు, వీఆర్వో ర‌ద్దు బిల్లుకు, తెలంగాణ గ్రామ అధికారుల ప‌ద‌వుల ర‌ద్దు బిల్లుకు శాస‌న‌స‌భ ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింది. నూత‌న రెవెన్యూ చ‌ట్టంపై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ ముగిసిన అనంత‌రం ఈ బిల్లుల‌కు ఆమోదం తెలిపారు. ఈ సంద‌ర్భంగా స‌భ్యులంద‌రూ బ‌ల్ల‌లు చ‌రుస్తూ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. నూత‌న రెవెన్యూ బిల్లును ఈ నెల 9వ తేదీన స‌భ‌లో సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ బిల్లుపై శుక్ర‌వారం సుదీర్ఘంగా చ‌ర్చించారు. స‌భ్యులంద‌రూ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు సీఎం కేసీఆర్ సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చారు.