సామాజిక ఉద్యమ నేత స్వామి అగ్నివేశ్‌ ఇకలేరు

ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, ఆర్యసమాజ్‌ నాయకుడు స్వామి అగ్నివేశ్‌ (80) శుక్రవారం కన్నుమూశారు. కొద్దిరోజులుగా కాలేయ సంబంధ అనారోగ్యంతో ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బిలియరీ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్న ఆయనకు శుక్రవారం సాయంత్రం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. దేశం నలుమూలలా జరిగిన అన్ని రకాల ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచిన స్వామి అగ్నివేశ్‌.. వెట్టిచాకిరి, మహిళా సమస్యలపై ప్రత్యేకంగా సుదీర్ఘ పోరాటం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి అనేక సభల్లో ప్రసంగించారు.