ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి అలివేలుమంగ(85) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంతో చినజీయర్ స్వామి తీవ్ర కలతకు గురవుతున్నారు. శంషాబాద్ ముచ్చింతల్‌లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమం సమీపంలో అలివేలుమంగ అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం జరగనున్నాయి. చినజీయర్ స్వామి తల్లి మృతిపై పలువురు రాజకీయ, ఆధ్యాత్మిక, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయనకు సానుభూతి ప్రకటించారు.
