వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాలో 250 క్వింటాళ్ల రేష‌న్ బియ్యం ప‌ట్టివేత‌

అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న 250 క్వింటాళ్ల రేష‌న్ బియ్యాన్ని పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా నల్లబెల్లి మండలం రంగాపురం శివారు సాయిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. రేష‌న్ బియ్యం అక్ర‌మ త‌ర‌లింపుపై స‌మాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి లారీని ప‌ట్టుకున్నారు. లారీ డ్రైవర్, క్లీనర్, మరొక వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. లారీని నల్లబెల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.