జీడిమెట్ల, దూలపల్లి పారిశ్రామికవాడల్లో కాలుష్యాన్ని నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. దూలపల్లిలో రూ. 31 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ‘ప్లాస్మికోర్’ వరల్డ్ క్లాస్ సెల్ఫ్ డిసింటిగ్రేషన్ యంత్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్లాస్మికోర్ ఏర్పాటు రాష్ట్రంలోనే మొదటిదని పేర్కొన్న ఆయన, ఈ యంత్రం ద్వారా ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థ పదార్థాలను కరిగించి దాని ద్వారా వచ్చే పొడితో ఇటుకలు, సిమెంట్, టైల్స్ వంటి వాటిని తయారు చేయవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్నశ్రీశైలంయాదవ్ తదితరులు పాల్గొన్నారు.