పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా సభ్యులకు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, అరకు ఎంపీ మాధవికి కరోనా పాజిటివ్ వచ్చింది. లక్షణాలు లేనప్పటికి ఇద్దరికీ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా సభ్యులందరు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ స్పష్టం చేశారు. నెగెటివ్ వచ్చినవారినే సభలోకి అనుమతిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అంరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు.