తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు కరోనాను జయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి హరీష్‌రావు సోమవారం శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావుకి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇక మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా కొవిడ్-19 టెస్టులు చేయించుకున్నందుకు స్పీకర్ వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. టెస్టులు చేయించుకోని ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. ప్రతి సభ్యుడు కొవిడ్ నిబంధనలు చేపట్టాలని సభ్యులను స్పీకర్ కోరారు.