జాతీయ నదుల సంరక్షణ కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు

దేశంలో నదుల శుద్ధి, పునరుజ్జీవం ఒక నిరంతర ప్రక్రియ. నదుల్లో నిరంతరాయంగా ప్రవహిస్తున్న కాలుష్య సవాలును ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా గుర్తించిన కలుషిత ప్రాంతాల్లో జాతీయ నదుల సంరక్షణ ప్రణాళిక (ఎన్ఆర్ సిపి) కింద చర్యలు తీసుకునేందుకు కేంద్రం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. అందులోభాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం, సాంకేతిక సహాయం అందిస్తుంది.

ఈ ఎన్ఆర్ సిపి కింద మురుగు నీటిని నిలువరించి, దారి మళ్లించే వ్యవస్థల ఏర్పాటు, మురుగునీటి పారుదల వ్యవస్థల నిర్మాణం, తక్కువ వ్యయంతో పారిశుధ్య వసతుల నిర్మాణం, నదుల పరిసరాలు, స్నానఘట్టాల అభివృద్ధి,ప్రజా భాగస్వామ్యం, చైతన్య కల్పన వంటి పలు కాలుష్య నిరోధక చర్యలు, పనులు చేపడుతున్నారు. 2018 నుంచి ఇప్పటివరకు ఎన్ఆర్ సిపి కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మంజూరైన మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, నిర్మాణం, రోజుకి మిలియన్ లీటర్ల (ఎంఎల్ డి) పరిమాణంలో సామర్థ్యాలను పెంపండించేందుకు చర్యలు చేపడుతున్నారు.