స్పుత్నిక్ వ్యాక్సిన్ సంస్థ‌తో డాక్ట‌ర్ రెడ్డీస్ ఒప్పందం

నోవ‌ల్ క‌రోనా వైర‌స్‌కు ర‌ష్యా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన విష‌యం తెలిసిందే. ఆ వ్యాక్సిన్ త‌యారీ సంస్థ ఆర్‌డీఐఎఫ్‌.. హైద‌రాబాద్‌కు చెందిన డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న‌ది. భార‌త్‌లో స్పుత్నిక్ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌ను డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్ నిర్వ‌హించ‌నున్న‌ది. స్పుత్నిక్‌-వి టీకాను కూడా రెడ్డీస్ ల్యాబ్ స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ది. ర‌ష్య‌న్ డైర‌క్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) ఇవాళ ఈ ఒప్పందంపై ప్ర‌క‌ట‌న చేసింది. ఒక‌వేళ త‌మ వ్యాక్సిన్‌కు భార‌త్‌లో ఆమోదం ద‌క్కితే, అప్పుడు సుమారు వంద మిలియ‌న్ల డోస్‌ల స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను రెడ్డీస్ ల్యాబ్‌కు స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ట్లు ఆర్‌డీఐఎఫ్ పేర్కొన్న‌ది. ర‌ష్యాలో ఇటీవ‌ల స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.