గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్ అభిలాష్ అభినవ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మహబూబాబాద్ కలెక్టర్ విపి గౌతమ్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మొక్కలు నాటిన అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ కాలుష్యాన్ని నివారించాలంటే ప్రతి ఒక్కరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా అద్భుతంగా ముందుకు పోతుందని కొనియాడారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. 16 సెప్టెంబర్ ప్రపంచ ఓజోన్ డే పురస్కరించుకొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా సంతోష్ రాజ్ ఐ.ఏ.ఎస్. అరుణాచల్ ప్రదేశ్, హరిశ్మరన్ ఐ.ఏ.ఎస్. మధ్యప్రదేశ్ , ఉత్సవ్ గౌతమ్ ఐ.ఏ.ఎస్. గుజరాత్, అభినవ్ సిద్దార్థ్ ఐ.ఏ.ఎస్., అభిజిత్ సిన్హా ఐ.ఏ.ఎస్. రాంచి లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.