నేడు, రేపు మోస్త‌రు నుంచి భారీ వాన‌లు

తెలం‌గాణ, దాని పరి‌సర ప్రాంతాల్లో ఏర్ప‌డిన ఉప‌రి‌తల ఆవ‌ర్తనం 2.1 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వ‌రకు కొన‌సా‌గు‌తు‌న్నది. ఉత్తర కోస్తాంధ్ర, పరి‌సర ప్రాంతాల్లో 3.1 కిలో‌మీ‌టర్‌ నుంచి 3.6 కిలో‌మీ‌టర్ల ఎత్తు మధ్య మరో ఉప‌రి‌తల ఆవ‌ర్తనం ఏర్ప‌డింది. ఈశాన్య బంగా‌ళా‌ఖాతం పరి‌సర ప్రాంతాల్లో ఈ నెల 20 అల్ప‌పీ‌డనం ఏర్పడే అవ‌కాశం ఉన్నది. వీటి ప్రభా‌వంతో రాష్ట్రంలో శుక్ర, శని‌వా‌రాల్లో చాలా‌ప్రాం‌తాల్లో ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని 19 జిల్లా‌ల‌తో‌పాటు గ్రేటర్‌ హైద‌రా‌బా‌ద్‌లో ఒకటి రెండు ప్రాంతాల్లో శుక్ర‌వారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది.