మచ్చబొల్లారం డంపింగ్‌యార్డ్ సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మతరావు అన్నారు. అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చబొల్లారంలో ఉన్న డం పింగ్ యార్డ్‌ను తరలించాలని కోరుతూ మచ్చబొల్లారం పరిధిలోని 13 కాలనీలకు చెందిన జేఏసీ కొన్ని రోజులుగా డంపింగ్ యార్డ్ వద్ద చేస్తున్న నిరసన ప్రదర్శనను ఆయన కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మమతతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మచ్చబొల్లారం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే, జడ్సీతో మాట్లాడుతూ డంపింగ్‌యార్డ్ మూలంగా మచ్చబొల్లారం పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన దుర్గంధం వ్యాపించడంతో పాటు వాతావరణ కాలుష్యం, భూగర్భ జలాలు కాలుష్యానికి గురై ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. స్థానిక ప్రజల ఆవేదనను విన్న ఎమ్మె ల్యే డంపింగ్‌యార్డ్ విషయమై స్థానిక ప్రజలతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే వరకు డంపింగ్ యార్డ్ పనులను తాత్కాలింగా నిలిపి వేయాలని జోనల్ కమిషనర్ మమతను ఆదేశించారు. ఎమ్మెల్యే హామీతో ప్రజలు ఆందోళను విరమించారు. కార్యక్రమంలో అల్వా ల్ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాద య్య, మున్సిపల్ అధికారులు జలందర్‌రెడ్డి, డీఈ మహేశ్, జేఏసీ సభ్యులు రాజేష్ కుమార్, పుష్ప, శ్రావణ్, నారాయణరెడ్డి, సాంబయ్య, రమేశ్, వీరేశం, స్వాతి, లక్ష్మి, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
