తెలంగాణ రాష్ట్రంలో టైప్ రైటింగ్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ షెడ్యూలు విడుదల చేసింది. లోయర్, హయ్యర్ గ్రేడ్ బ్యాచ్‌లకు ఈనెల 20న, షార్ట్ హ్యాండ్ పరీక్షలు ఈనెల 27న, అక్టోబర్ 4న పరీక్షలు జరగనున్నాయి. ఆదివారం (సెప్టెంబర్ 20) ఉదయం లోయర్, మధ్యాహ్నం హయ్యర్ గ్రేడ్ బ్యాచ్‌లకు పరీక్షలు జరగనున్నాయి. మాసాబ్ ట్యాంక్, మారేడ్‌పల్లి, రామంతాపూర్, అమీర్‌పేట్‌లోని దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ పరీక్షలు జరగుతాయని టీఎస్ఎస్బీటెట్ తెలిపింది.
షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు మార్చి నెలలోనే పూర్తవ్వాల్సి ఉన్నది. అయితే కరోనా వైరస్ కారణంగా పరీక్షలు వాయిదాపడ్డాయి. పూర్తివివరాలకు sbtet.telangana.gov.inలో చూడవచ్చు.