సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం నందికంది గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులోని బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో లిమిటెడ్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతులను అరవింద్, బసవరాజుగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
