పంచాయితీరాజ్ శాఖలో పనిచేసి పదవీ విరమణ చేసిన కె.యాదయ్యగౌడ్‌కు అరుదైన సత్కారం దక్కింది. కొవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో చేసిన సేవలను గుర్తించి విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఫౌండేషన్ సంస్థ ఆయనకు కరోనా వారియర్ అవార్డుకు ఎంపిక చేశారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి అవార్డును అందజేశారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతామని యాదయ్యగౌడ్ తెలిపారు. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
