అడిబ్స్‌లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు మృత్యువాతపడ్డారు. అబిడ్స్ పోలీస్‌స్టేషన్ పరిధి కృపా టిఫిన్ సెంటర్‌లో పని చేసే మాస్టర్ బైక్‌పై పని ముగించుకొని ఇంటికి తిరుగు పయణమయ్యాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా అటువైపుగా వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తిని దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా, ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీకెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.