జర్నలిస్టుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

2014 జూన్‌ తరువాత మరణించిన జర్నలిస్టులకు సంబంధించి వారి కుటుంబసభ్యులు, అనారోగ్యం బారినపడి పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తునట్టు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ వెల్లడించారు. గతంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి లబ్ధి పొందినవారు, ఇప్పటికే మీడియా అకాడమీకి దరఖాస్తు పంపినవారు మళ్లీ దరఖాస్తు చేయవలసిన అవసరంలేదని చెప్పారు. జిల్లా పౌరసంబంధాల ఉప సంచాలకులు, సహాయ సంచాలకులు, డీపీఆర్వోల ద్వారా దరఖాస్తులను ధ్రువీకరించుకోవాలని సూచించారు. వాటిని హైదరాబాద్‌లోని మీడియా అకాడమీ కార్యాలయానికి పంపించాలని చెప్పారు. వివరాలకు 040-23298672, 23298674 సంప్రదించాలని ఆయన తెలిపారు.