సూరత్‌ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

సూరత్‌లోని హజీరా వద్ద ఓ పరిశ్రమలో గ్యాస్‌ లీకేజీతో అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ప్లాంట్‌ పక్కన ఉన్న పరిశ్రమలో గురువారం తెల్లవారు జామున ప్రమాదం చోటు చేసుకుంది. హైడ్రో కార్బన్‌ వాయువు లీకేజీతో అగ్ని ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురి ఆచూకీ కనిపించడం లేదు. దీంతో తోటి కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కిలోమీటర్ల పొడవున పొగ కమ్ముకుంది.