శ్రీవారిని దర్శించుకున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం మరోసారి దర్శించుకున్నారు. సీఎం జగన్‌తో కలిసి కర్ణాటక సీఎం యడియూరప్ప స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన కర్ణాటక సీఎంకు, మహాద్వారం ప్రవేశ మార్గం వద్ద ముఖ్యమంత్రి‌ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఇరు ముఖ్యమంత్రులకు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు.