ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ని కలిసిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ శనివారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ చరిత్ర , సాహిత్యం, జానపద కళలు, సంస్కృతి, కవిత్వం వంటి అంశాలపై ప్రచురించిన పుస్తకాలను హరికృష్ణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేసారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర కళాకారులకు అభినందనలు తెలిపారు.