నేటి నుంచి హైదరాబాద్‌లో సిటీ బస్సులు

సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌లో సిటీ బస్సులు రోడ్డెక్కనున్నా యి. నగరవాసుల సౌకర్యార్థం బస్సులను నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తొలుత కేవలం 25 శాతం బస్సులు నడుపనున్నారు. కొవిడ్‌ నిబంధనలు అనుసరిస్తూ శుక్రవారం నుంచి 700 బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. అంతర్రాష్ట్ర బస్సులపైనా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టత ఇచ్చినట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. గురువారం సాయంత్రం సీఎంను మంత్రి కలిశారు. ఈ సందర్భంగా సిటీబస్సుల్లో 25 శాతం బస్సులను పునరుద్ధరించేందుకు సీఎం అనుమతి ఇచ్చారని పువ్వాడ తెలిపారు. శానిటైజేషన్‌కు అన్ని చర్యలు తీసుకున్నామని, ఆక్యుపెన్సీని బట్టి బస్సుల సంఖ్యను పెంచుతామని వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామునుంచే బస్సుల పునరుద్ధరణకు చర్య లు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. సిటీ బస్సులతోపాటు అంతర్రాష్ట్ర బస్సులకు సంబంధించి సీఎం కేసీఆర్‌ పలు సూచనలు చేసినట్టు మం త్రి తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర అంతర్రాష్ట్ర బస్సుల్ని కూడా పునరుద్ధరించాలని సీఎం చెప్పారని పేర్కొన్నారు. దీంతో ఈ రెండు రాష్ర్టాలకు బస్సు సర్వీసులు నడువనున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్‌ అంతర్రాష్ట్ర బస్సులపై మాత్రం అధికారుల స్థాయి లో చర్చలు కొలిక్కి వచ్చిన తర్వాతే పునరుద్ధరిస్తామని అన్నా రు. ముఖ్యం గా రెండు రాష్ర్టాలు సమాన కిలోమీటర్లు బస్సులు నడపాలని ముందు నుంచి తెలంగాణ ప్రతిపాదిస్తున్నది. ఏపీ తమ ప్రతిపాదనలకు అంగీకరించే వరకు తెలంగాణ-ఏపీ మధ్య బస్సులపై చర్చలు కొలిక్కి వచ్చే పరిస్థితి లేదని అధికార వర్గాలు చెప్తున్నాయి.