తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనే ‘‘గంజాయి వనంలో తులసి మొక్కలు“

తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనే ‘‘గంజాయి వనంలో తులసి మొక్కలు“ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనే ఈ పదానికి పూర్తి ఆర్దమే మార్చివేసిన అధికారులు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అసలు తాము ఉన్నది పొల్యూషన్ ను కంట్రోల్ చేయడానికి అనే విషయమే మర్చిపోయారు కొందరు పిసిబి అధికారులు. అంతేకాదు అసలు తమ డ్యూటీ పొల్యూషన్ ను కంట్రోల్ చేయడం కాదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోని కొందరు అధికారులు. కాలుష్యం చేస్తున్న పరిశ్రమలను దారిలో పెట్టే బాధ్యత తమదే అన్న సంగతి కూడా మరిచిపోయారు. కాలుష్యాన్నికంట్రోల్ చేసి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలన్న ధ్యాసనే లేదు మన పిసిబి అధికారులకు. అవినీతి సొమ్ముకు అలవాటు పడటం, ఆశపడటం తప్ప మేము చేసేది ఏమి లేదు అన్నట్టు తయారైంది తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల పరిస్థితి.

ఇంత దరిద్రంగా తయారైన తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా ‘‘గంజాయి వనంలో తులసి మొక్కలు“లాగా కొంత మంది నీతి, నిజాయితీ, సమర్థత, అంకిత భావం కలిగిన అధికారులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు వారి గురించే చెప్పబోతున్న, వారే మాజీ సి.ఎస్., ప్రస్తుత తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ రాజీవ్ శర్మ, మాజీ ఎం.ఎస్. ఎస్.కె. సిన్హా మరియు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంచార్జ్ ఎం.ఎస్. నీతూ కుమారి ప్రసాద్, అలాగే ప్రస్తుత తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సి.ఇ.ఇ.గా పని చేస్తున్న విశ్వనాధం, సంగారెడ్డి ఇ.ఇ. గా పనిచేస్తూ ఎన్.జి.టి. ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పర్యావరణ పర్యవేక్షణ విభాగంలో ప్రస్తుతం పనిచేస్తున్న భద్ర గిరీష్, అలాగే పిసిబి ప్రధాన కార్యాలయంలో ఇ.ఇ.గా పనిచేస్తున్న కుమార్ పాఠక్ ఇంకా కొంత మంది నీతి, నిజాయితీ, అంకిత భావం, సమర్థత కలిగిన అధికారులు ఉండబట్టే తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎంతో కొంత పరువు నిలబెట్టుకుంటుంది అని చెప్పవచ్చు. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనే పదాన్ని పూర్తిగా మార్చివేసి పొల్యూషన్ క్రియేషన్ బోర్డులా తయారు చేసిన అధికారుల మధ్య ఇంతటి నిజాయితీపరులు, అంకిత భావం, సమర్థత కలిగిన అధికారులు ఎలా ఉన్నారో ఆ భగవంతుడుకే తెలియాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటేనే అవినీతికి మారు పేరు అనుకుంటున్న ఈ తరుణంలో ఇలాంటి నీతి, నిజాయితీ, అంకిత భావం, సమర్థత కలిగిన అధికారుల గురించి కూడా చెప్పుకోవడం ఎంతో అవసరం. వీరే కాదు బోర్డులో ఇంకా మరి కొంతమంది నీతి, నిజాయితీ, అంకిత భావం, సమర్థత కలిగిన అధికారులు, ఉద్యోగులు వివిధ హోదాలలో పని చేస్తూ ఉన్నారు. నిజాయితీ, సమర్ధత కలిగిన అధికారులను వెన్నుతట్టి ప్రోత్సహించడమే కాదు, అలాంటి వారిని దుష్టశక్తుల నుండి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఇలాంటి నీతి, నిజాయితీ కలిగిన కొంతమంది అధికారులు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్నారు కాబట్టే ప్రజలు కొద్దిగానైన ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. లేదంటే అవినీతి సొమ్ముకు అలవాటుపడిన కొంతమంది తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల పనితీరుతో ప్రజలు కాలుష్యంతోనే సర్వ రోగాలతో బాధపడేవారు. అంతేకాదు పరిశ్రమలు ఉన్న చోట భూగర్భ జలాలు కలుషితమై కొన్ని ఊర్లకు తాగు & సాగు నీరు కూడా కరువైంది. పరిశ్రమల యాజమాన్యాలు కూడా కలుష్యాన్ని కంట్రోల్ చేయకుండా ఈ అవినీతి అధికారులను డబ్బుతో మాయచేసి బహిరంగ పొల్యూషన్ చేస్తున్నారు. పొల్యూషన్ చేస్తున్న పరిశ్రమ యాజమాన్యాల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుందంటేనే అర్థం అవుతుంది పిసిబి అధికారుల పనితీరు ఎంత దారుణంగా ఉందో.. తెలంగాణ పిసిబి అధికారులు పొల్యూషన్ ను కంట్రోల్ చేయడంలో కాకుండా అవినీతి సంపాదనలో పోటీపడుతున్నారు. నీతి, నిజాయితీ, అంకిత భావం సమర్ధత కలిగిన కొంత మంది అధికారులు అయినా పిసిబిలో ఉన్నారు కాబట్టే పొల్యూషన్ తో నష్టపోతున్న పేద రైతులకు, సామాన్య ప్రజలకు మరియు పర్యావరణానికి కొంతైనా మేలు జరుగుతుంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు నీతి నిజాయితీ, అంకిత భావం, సమర్థత కలిగిన అధికారుల అవసరం ఎంతో ఉంది. వీలైతే ప్రస్తుత తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంచార్జ్ ఎం.ఎస్. నీతూ కుమారీ ప్రసాద్ ను పూర్తిస్థాయిలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు పనిచేసేలా చేస్తే బాగుంటుందని పర్యావరణ వేత్తలు, ప్రజల నోట వస్తున్న మాట. ప్రస్తుత తరుణంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డును సమూలంగా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణ వేత్తలు, పొల్యూషన్ బాధితులు, ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.