తడి, పొడి చెత్త సేకరణ వాహనాలు ప్రారంభించిన రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో తడి, పొడి చెత్త సేక‌ర‌ణ కోసం ఏర్పాటు చేసిన 30 వాహ‌నాల‌ను రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ శ‌నివారం ప్రారంభించారు. ఇప్ప‌టికే న‌గ‌రంలో 20 వాహ‌నాలు అందుబాటులో ఉన్నాయ‌ని మంత్రి తెలిపారు. ప్ర‌తి డివిజ‌న్‌కు ఒక వాహ‌నాన్ని కేటాయించి.. చెత్త‌ను సేక‌రిస్తున్న‌ట్లు చెప్పారు. స్వయం సహాయక సంఘాల ద్వారా తడి, పొడి చెత్తను వేరు చేసి వారికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఒక్కో వాహనం రూ.5.24 లక్షలు కాగా మొత్తం రూ.1.57 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు తెలిపారు.