మహిళల సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా నీతూ డేవిడ్

భారత మహిళల క్రికెట్‌ జట్టు సెలెక్షన్‌ కమిటీ కొత్తగా కొలువు దీరింది. 90వ దశకంలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రికెటర్‌ నీతూ డేవిడ్‌.. సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా ఎంపికైంది. హేమలత నేతృత్వంలోని కమిటీ పదవీకాలం మార్చితో ముగిసిన నేపథ్యంలో నూతన కార్యవర్గాన్ని నియమిస్తూ బీసీసీఐ శనివారం నిర్ణయం తీసుకుంది. నీతూ చైర్మన్‌గా వ్యవహరించనున్న కమిటీలో మితు ముఖర్జీ, రేణు మార్గరేట్‌, ఆర్తీ వైద్య, కల్పన ఉన్నారు. వీరంతా గతంలో టీమ్‌ఇండియాకు ఆడిన వారే.