దేశంలో కరోనా మహమ్మారి విస్తృతి కొనసాగుతూనే ఉన్నది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా భారీ సంఖ్యలో కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా గోవా డీజీపీ ముఖేశ్ కుమార్ మీనాకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన వెంటనే గోవా రాష్ట్రం దొన పౌలా ఏరియాలోని మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని, చికిత్స కొనసాగుతున్నదని వైద్యులు తెలిపారు.
