పినపాక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు పినపాక నియోజకవర్గంలో మొదలు పెట్టినటువంటి గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలను నాటవలసిందిగా యువజన విభాగానికి సూచించడం జరిగింది. అందులో భాగంగా మణుగూరు కోర్టు ఆవరణలో మణుగూరు మేజిస్ట్రేట్ శ్రీ N శ్యామ్ సుందర్ సహకారంతో మూడు మొక్కలు నాటి గ్రీన్ చాలెంజ్ పూర్తి చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో “రేగా సైన్యం” సభ్యులు రాజేష్, హరి, నరేందర్, దీపక్, ప్రవీణ్ మరియు కోర్టు సిబ్బంది హోంగార్డు కళ్యాణ్ మరియు నారాయణ గౌడ్ పాల్గొనడం జరిగినది.