టాటా ఇన్‌స్టిట్యూట్‌ సలహా మండలి సభ్యుడిగా వినోద్‌కుమార్‌

ప్రతిష్ఠాత్మకమైన టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టీఎస్‌) సలహా మండలి సభ్యుడిగా బోయినపల్లి వినోద్‌కుమార్‌ నియమి తులయ్యారు. ఆయన ఈ పదవిలో రెండేండ్లపాటు కొనసాగుతారు.1964 సంవత్సరంలో టీఎస్‌ను గ్రేడ్‌ వన్‌ డీమ్డ్‌ వర్సిటీగా కేంద్రం గుర్తించింది. యూజీసీ నిధులతో టీఎస్‌ను నిర్వహిస్తున్నారు.  సీనియర్‌ పార్లమెంటేరియన్‌ కావడం, పాలనాపరమైన ప్రతిఅంశంపై అవగాహన ఉండటంతోపాటు న్యాయవాదిగా దశాబ్దాల అనుభవం ఉండటం వల్లే వినోద్‌కుమార్‌ను ఈ పదవికి టీఎస్‌ చైర్మన్‌ రామదొరై ఎంపిక చేశారు.