గౌరవ రాజ్యసభ సభ్యులు TRS పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రవేశపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఎడవెల్లి క్రిష్ణారెడ్డి (TRS పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరంగల్ జిల్లా) విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను తెరాస రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి స్వీకరించి నేడు వారి వ్యవసాయ క్షేత్రంలో మామిడి మొక్కలు నాటడం జరిగింది.
అనంతరం వారు మాట్లాడుతూ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ నేడు ఉద్యమంలా దిగ్విజయంగా సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించడం సంతోషించదగిన విషయం అని ఆయన అన్నారు.
ఇప్పటి వరకు దాదాపు 4కోట్ల మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. నేడు అంతరించి పోతున్న పర్యావరణన్ని రక్షించడం మన అందరి బాధ్యతగా స్వీకరించి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
ఈ ఛాలెంజ్ ని బండా నరేంద్రర్ రెడ్డి (జడ్పీ ఛైర్మన్ నల్గొండ)కి, ఎల్గనమోని అంజయ్య యాదవ్ (MLA షాద్ నగర్)కి, N జగదీశ్వర్ రెడ్డి (RDO నల్గొండ)ని ఈ గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించాలని కోరారు.