పరిశ్రమలశాఖ కమిటీ చైర్మన్‌గా కేకే

పరిశ్రమలశాఖ పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, వాణిజ్యశాఖ కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు నియ మితు లయ్యారు. స్టాండింగ్‌ కమిటీలను నియమిస్తూ పార్లమెంటరీ సెక్రటేరియట్‌ మంగళ వారం బులిటెన్‌ విడుదల చేసింది. కమిటీలు ఏడాదిపాటు అమల్లో ఉంటాయి. కేకే మినహా మిగిలిన ఎంపీలు కమిటీల్లో సభ్యులుగా నియమితులయ్యారు.