తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 9 నుంచి 14 వరకు నిర్వహించిన ఎంసెట్ (ఇంజినీరింగ్ విభాగం) ఫలితాలను అక్టోబర్ 6న విడుదల చేయనున్నారు. తొలుత అక్టోబర్ 5న ఫలితాలు విడుదలచేయాలని అధికారులు భావించారు. అయితే, అదేరోజు జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు ఉండటంతో ఫలితాలు అక్టోబర్ 6న విడుదలచేయాలని నిర్ణయించామని ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.
కొవిడ్ విద్యార్థులకు త్వరలో ఎంసెట్, ఈసెట్!
కరోనా బారిననపడి గత నెలలో నిర్వహించిన ఎంసెట్, ఈసెట్‌కు హాజరుకాలేకపోయిన వారికి త్వరలోనే పరీక్షలు నిర్వహించే అవకాశమున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి తెలిపింది. కొవిడ్‌బారిన పడ్డ విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నామని, ఎంసెట్, ఈసెట్ కలిపి దాదాపు 60 మంది విద్యార్థులు ఉంటారని వెల్లడించింది. అక్టోబర్ 3న రెండు పరీక్షలను జేఎన్‌టీయూ హైదరాబాద్ క్యాంపస్‌లో నిర్వహించే అవకాశాలున్నట్టు ఉన్నతవిద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి పేర్కొన్నారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉన్నది.