టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లాలో ఊహించని షాక్ తగిలింది. పార్టీ సీనియర్ మహిళా నేత, మాజీమంత్రి గల్లా అరుణకుమారి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆమె గురువారం ప్రకటించారు. కాగా తెలుగుదేశం పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తున్న తరుణంలో గల్లా అరుణ కుమారి రాజీనామా చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
