మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని కలిసిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్

బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీ ఆయన నివాసంలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా పాల్గొన్నారు.