భువనగిరి పారిశ్రామికవాడలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కూలర్ల గోదాంలో షార్ట్‌సర్క్యూట్ సంభవించి మంటలు వ్యాపించాయి. దీంతో గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని మంటలు సమీప ప్రాంతాలకు వ్యాపించకుండా అదుపు చేశారు. ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించిందని అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
