రిజిస్ట్రేషన్లు, స్టాంపులశాఖ ఐజీగా వి.శేషాద్రికి అదనపు బాధ్యతలు

రిజిస్ట్రేషన్లు. స్టాంపులశాఖ ఐజీ చిరంజీవులు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇటీవల సీఎంఓ కార్యదర్శిగా నియమితులైన వి.శేషాద్రికి రిజిస్ట్రేషన్లు, స్టాంపులశాఖ ఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. గత ఐదున్నరేళ్లుగా పీఏంఓలో బాధ్యతలు నిర్వర్తించిన శేషాద్రి కేంద్ర సర్వీసును పూర్తి చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. ఆయన రాగానే సీఎం కేసీఆర్‌ ఆయనకు రెవెన్యూ చట్టాల సమీక్ష బాధ్యతలు అప్పగించారు. 1999  ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన శేషాద్రి బెంగళూరులోని నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ లా నుంచి పట్టభద్రుడయ్యారు. రెవెన్యూ చట్టాలపై ఆయనకు గట్టిపట్టు ఉంది. గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా, యూఎల్సీ ప్రత్యేకాధికారిగానూ ఆయన పని చేశారు.