యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న ఏపీ మంత్రి విశ్వరూప్‌

యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని  ఏపీ సాంఘిక సంక్షేమ శాఖల మంత్రి పినిపే విశ్వరూప్‌ శుక్రవారం సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి స్వామివారి ఆశీర్వచనాలతోపాటు తీర్థప్రసాదాలు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతోందని ఆయన అన్నారు.