ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగాలపై సీబీఐ అధికారులు హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ కంప్యూటర్ సెక్షన్ సూపరింటెండెంట్ కే జనార్దన్‌రావు, అతడి భార్య శైలజపై శుక్రవారం కేసు నమోదుచేశారు. 1992లో సెంట్రల్ ఎక్సైజ్‌శాఖలో ఇన్స్పెక్టర్గా చేరిన జనార్దన్‌రావు వివిధ కమిషనరేట్లలో పనిచేశారు. హైదరాబాద్ జీఎస్టీ కార్యాలయంలోనూ 2017 నవంబర్‌నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు పన్ను ఎగవేత నిరోధక విభాగంలో సూపరింటెండెంట్‌గా పనిచేశారు. ఆ సమయంలో అవినీతికి పాల్పడినట్టు సీబీఐ అధికారులు ఆధారాలు సేకరించారు. రూ.1.27కోట్ల మేర అవినీతికి పాల్పడినట్టు సీబీఐ అధికారులు ఆధారాలు సేకరించారు.
