ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రిన్సిపాల్స్‌గా పనిచేస్తున్న ఐదుగురికి డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ (డీఐఈవో)లుగా పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ఆ ఐదుగురిని డీఐఈవోగా నియమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మేడ్చల్ జిల్లాకు అబ్దుల్ ఖాలిక్, రంగారెడ్డి జిల్లాకు యెంక్యా, నల్లగొండ జిల్లాకు దస్రూ, వరంగల్ అర్బన్‌కు ఏ గోపాల్, ఖమ్మం జిల్లాకు ఎం కిషన్ నియామకం అయ్యారు.
