‘కరోనా’ అభ్యర్థులకు ఈ నెల 8న ఎంసెట్‌

కరోనా బారినపడి గత నెల 9 నుంచి 14వరకు నిర్వహించిన ఎంసెట్‌కు హాజరుకాలేకపోయిన వారికోసం ఈ నెల 8న ప్రత్యేకంగా ఎంసెట్‌ నిర్వహించడానికి ఏర్పాట్లుచేస్తున్నామని కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ తెలిపారు. కరోనా పాజిటివ్‌, నెగెటివ్‌ సర్టిఫికెట్లతోపాటు హాల్‌టికెట్‌ కూడా కన్వీనర్‌ ఈ- మెయిల్‌కు ఈనెల 5 అర్ధరాత్రిలోగా పంపించాలని సూచించారు. వారికి పరీక్ష కేంద్రం, సీబీటీ కోసంస్లాట్‌ బుక్‌చేసి, ఆ సమాచారాన్ని తెలియజేస్తామని వివరించారు. ఇందుకు convenertseamcet2020 [email protected]ను సంప్రదించాలని తెలిపారు. http://eamcet.tsche.ac.inను చూడాలనిచెప్పారు.